టీమిండియా స్టార్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కు ఫాలోయింగ్ బాగానే పెరిగిపోతోంది. ఈ తరునంలోనే… టీమిండియా స్టార్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ డేటింగ్లో ఉన్నట్లు మరోసారి వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నటి, బిగ్‌బాస్-13తో ఫేమస్ అయిన మహీరా శర్మతో సిరాజ్ గత కొద్ది రోజులుగా ప్రేమాయణం సాగిస్తున్నట్లు ఓ ఇంగ్లిష్ మీడియా సంస్థ పేర్కొంది.
గతేడాది మహీరా ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌ను లైక్ చేయడం, ఆ తర్వాత ఒకరినొకరు ఫాలో కావడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. అయితే, దీనిపై సిరాజ్ స్పందించాల్సి ఉంది. అయితే… మహిరా, సిరాజ్‌ల డేటింగ్ రూమర్లపై మహిరా శర్మ తల్లి సానియా శర్మ స్పందించారు. టైమ్స్ నౌతో మాట్లాడుతూ, మహిరా, సిరాజ్‌ల డేటింగ్ రూమర్లను తోసిపుచ్చారు మహిరా శర్మ తల్లి సానియా శర్మ. “ప్రజలు ఏదైనా చెబుతారు. ఇప్పుడు నా కూతురు సెలబ్రిటీ కావడంతో ఆమె పేరు ఎవరితోనైనా ముడిపడి ఉంటుంది. అవన్నీ మనం నమ్మాలా?” వాటిని సీరియస్‌గా తీసుకోవద్దని స్పష్టం చేసింది మహిరా శర్మ తల్లి సానియా శర్మ.