జీహెచ్‌ఎంసీ వద్ద మోహరించిన వందలాది పోలీసులు

-

జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.చరిత్రలోనే తొలిసారిగా అత్యంత భారీ భద్రత నడుమ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది.జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నలుదిక్కుల భారీగా పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

గురువారం ఉదయం జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం మొదలైన విషయం తెలిసిందే. సమావేశం ప్రారంభం కాగానే బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు సభలో గందరగోళం సృష్టించారు. మేయర్ విజయలక్ష్మి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిచేయాలని, హైదరాబాద్ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. దీంతో కౌన్సిల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకోగా.. గులాబీ కార్పొరేటర్లను మేయర్ సభ నుంచి బయటకు పంపించి వేశారు.అక్కడే ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news