రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు నాలుగు నెలలకు జీతాలు రావడం లేదని తెలుస్తోంది. దీంతో శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో సమగ్ర కుటుంబ సర్వే కులగణన వివరాలను ఎంట్రీ చేసిన 350 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లకు 4 నెలలుగా ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదని సమాచారం.
దీంతో శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్‌పై మాదాపూర్ ఏసీపీకి డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఫిర్యాదు చేశారు. తమకు నాలుగు నెలలుగా జీతాలు రావడం లేదని, ఈ సమస్యపై వెంటనే స్పందించి తమకు పరిష్కారం చూపించాలని డేటా ఎంట్రీ ఆపరేటర్లు కోరారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో జీతాలు రాక కాంట్రాక్టుతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నది.