వైన్స్, బార్ లలో కాకుండా ఎక్కడా మద్యం అమ్మకూడదు : ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్

-

గత 4 ఏళ్లు గా సాగు చేస్తున్న గంజాయి పై సమీక్ష చేశాం. అనకాపల్లి జిల్లా నేడు తనిఖీల్లో పట్టుబడ్డ గంజాయి సీజ్ చేసాం అని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ అన్నారు. అక్రమం గా మద్యం రవాణా, వాడకం పై కఠిన చర్యలు తీసుకుంటాం. వైన్ షాప్, బార్ లలో కాకుండా మరి ఏ చోట మద్యం అమ్మటానికి ఆస్కారం లేదు. ఉత్తరాంధ్ర గ్రామాలుల్లో బెల్ట్ షాప్ మద్యం అమ్మకాలును అడ్డుకుంటాం. బెల్ట్ షాపులు నడిపే వారిపై చర్యలు తీసుకోవాల్సిన వాటి పై అధికారులు తో సమీక్ష నిర్వహిస్తాం. క్రైమ్ కు తావు లేకుండా చూసుకుంటాం అని అన్నారు.

అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ.. విశాఖ అభివృద్ది చెందుతున్న నగరం కావటం తో కొన్ని మాదక ద్రవ్యాలు వస్తున్నవి. అటువంటి మాదక ద్రవ్యాలు, గంజాయి లేకుండా నిఘా పెంచుతున్నాం. గంజాయి లేకుండా రాష్ట్రం ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అన్ని శాఖలు తో కలిసి వచ్చే 1 సంవత్సరంలో గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేస్తాం. టూరిజంలో విశాఖ ముందుకు వెళ్తున్న కారణంగా నూతన పాలసీ తీసుకు వస్తాం అని నిశాంత్ కుమార్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news