సోనియా గాంధీ వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు

-

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన అభివృద్ధి పనులను, కేంద్ర ప్రభుత్వ పథకాలతో దేశ ప్రజలకు జరిగిన ప్రయోజనాలను వివరించారు.. అయితే, కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోదీ ప్రభుత్వ విజయాలను ఓర్వలేక, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, దేశ ప్రజలకు జరుగుతున్న మేలును సహించలేక రాష్ట్రపతి గారిపై అనుచితమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు తీవ్రంగా ఖండించారు.

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ గారు గౌరవ రాష్ట్రపతిపై “బోరింగ్”, “అలసిపోయారు”, “రబ్బరు స్టాంప్” అంటూ విమర్శలు చేయడం, కాంగ్రెస్ పార్టీ రాజకీయ అహంకారాన్ని ప్రతిబింబిస్తోంది. మహిళా సాధికారత గురించి మాటలు వల్లెవేసే కాంగ్రెస్ నాయకులు.. ఒక గిరిజన మహిళా రాష్ట్రపతిని గౌరవించాలనే విజ్నత లేకపోవడం సిగ్గుచేటు. గత 10 ఏళ్లుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లింది. పేదల కోసం, మహిళలు, రైతులు, గిరిజనుల కోసం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేసింది. అయితే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నాయకులు ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు చేయడం అంటే దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్లుగానే భావిస్తున్నాం. అందుకు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు తక్షణమే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి క్షమాపణలు చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. లేకుంటే దేశ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నామని శిల్పారెడ్డి గారు హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news