ఉగాదికి గద్దర్ అవార్డులు : భట్టి

-

ఉగాదికి గద్దర్ అవార్డులు ఇవ్వనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రం మావల్లనే వచ్చిందని చెప్పుకునే వాళ్ళ కంటే గద్దర్ తోటే తెలంగాణ ఉద్యమ వ్యాప్తి అయ్యింది. అలాంటి వ్యక్తిని ప్రగతి భవన్ ముందు గంటల తరబడి కూర్చోబెట్టడం ఎంతవరకు న్యాయం. అయితే గత ప్రభుత్వం గద్దర్కి గౌరవం ఇవ్వకపోయినా.. గద్దర్ గౌరవాన్ని ఈ ప్రభుత్వం ఆకాశమంత ఎత్తుకి నిలబెడుతోంది అని అన్నారు.

ఇక గద్దర్ ఉద్యమంలోకి పోండి వాళ్ళని చంపండి వీళ్ళని చంపండి అని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ దేశంలో ఉన్న సకల సమస్యలకు రాజ్యాంగమే పరిష్కారం చూపుతోందని నమ్మిన వ్యక్తి గద్దర్. అలాంటి గద్దర్ ని గౌరవించడం అంటే దేశ ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టు. దేశాన్ని గౌరవించుకోవాలని ఆలోచన లేని వల్లే గద్దర్ పై ఆరోపణలు చేస్తారు. అయితే అన్ని వర్గాల విద్యార్థులు ఒకే దగ్గర చదువుకోవాలని ఆలోచన గద్దర్ దే అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news