బాలుడిపై మారు తండ్రి దాష్టీకం.. వైరుతో దాడి చేసి గాయాలపై కారం చల్లి!

-

ఏపీలో దారుణం చోటుచేసుకుంది. ఓ మారు తండ్రి కొడుకును విచక్షణారహితంగా చితకబాది అంతటితో ఆగకుండా ఒంటిపై అయిన గాయాలపై కారం చల్లిన ఘటన ఆదివారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. పాపం బాలుడు దెబ్బలు తాళలేక బక్కచిక్కిపోయి వణుకుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఘటన ఏపీలోని ఏలూరు – జంగారెడ్డిగూడెంలో వెలుగుచూసింది. ఫోన్ ఛార్జింగ్ వైరుతో కొట్టి మారు తండ్రి చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు బాలుడు వాపోయాడు.కొంతకాలంగా తనను కొడుతున్నారని, కొట్టిన తర్వాత గాయాలపై కారం చల్లుతున్నారని బాలుడు రాహుల్ కంటతడి పెట్టుకున్నాడు. ఆ గాయాలు చూసిన వారంతా ఒక్కసారిగా చలించిపోయారు.దీనికి బాధ్యుడైన మారు తండ్రిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news