పాలమూరు ప్రాజెక్టు గుంతలో పడి ఇద్దరు చిన్నారులు దుర్మరణం

-

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ కోసం తీసిన గుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి చెందారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామశివారులో ఆదివారం ఉదయం వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. వ్యవసాయ పొలం వద్దకు తల్లితో పాటు వెళ్లిన భాగ్యలక్ష్మి (6), మహేష్ (4) అనే చిన్నారులు ప్రమాదవశాత్తు గుంతంలో పడిపోయారు.

తల్లి వ్యవసాయ పనిలో నిమగ్నం అయి ఉండగా చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి ప్రాజెక్టు కోసం తీసిన గుంతలో పడి ప్రాణాలు కోల్పోయారు.తమకు ఎలాగైనా న్యాయం చేయాలని ప్రమాద స్థలం వద్ద బాధిత కుటుంబాలు, గ్రామ ప్రజలు ధర్నాకు దిగారు. విషయం తెలియడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

 

https://twitter.com/TeluguScribe/status/1885959757007061001

Read more RELATED
Recommended to you

Latest news