తమ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి రైతుల నిరసన తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని నారాయణపురం రైతులు తమ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలని ఆందోళన బాట పట్టారు.ప్రభుత్వానికి, నాయకులకు ఎన్ని సార్లు విన్నవించుకున్నా తమకు న్యాయం జరగడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తహశీల్దార్ కార్యాలయం సమీపంలోని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి రైతుల నిరసనకు దిగారు.మంత్రి పొంగులేటి అసెంబ్లీలో చెప్పినా కూడా అధికారులు లెక్క చేయట్లేదంటూ రైతులు మండిపడుతున్నారు. తమకు పాస్ పుస్తకాలు ఇవ్వకుంటే మందు తాగి చస్తామని రైతులు స్పష్టంచేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలంటూ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి రైతుల నిరసన
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం రైతుల భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలంటూ తహశీల్దార్ కార్యాలయం సమీపంలోని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి రైతుల నిరసన
మంత్రి పొంగులేటి అసెంబ్లీలో… pic.twitter.com/xne5H5xxQ8
— Telugu Scribe (@TeluguScribe) February 3, 2025