టీటీడీలో అన్యమత ఉద్యోగులకు బిగ్ షాక్ తగిలింది. టీటీడీలో అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు వేసింది పాలక మండలి. ఇందులో భాగంగానే 18 మంది ఉద్యోగులను బదిలీ చేసిన అధికారులు.. ఈ మేరకు ప్రకటన చేశారు. టీటీడీలో మొత్తం 300 మంది అన్యమతస్తులు ఉన్నట్లు సమాచారం అందుతోంది.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/01/Untitled-1-11.jpg)
బదిలీ అయిన వారిలో టీటీడీ మహిళ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, ఎస్వీయు అయుర్వేద కాలేజీ ప్రిన్సిపాల్, వివిధ విద్య సంస్థల్లోని లెక్చరర్లు, వసతి గృహం వార్డెన్, తదితరులు ఉన్నారు. త్వరలోనే మరికొంత మంది అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు పడే ఛాన్స్ కూడా ఉందట.
ఇది ఇలా ఉండగా తిరుమలలో రద్దీ తక్కువగా ఉంది. శ్రీవారి దర్శనానికి భక్తులు డైరెక్ట్ క్యూలైన్‌లో వెళ్తున్నారు. స్వామివారి సర్వదర్శనానికి గంట సమయం పడుతోంది. నిన్న(మంగళవారం) శ్రీవారిని 73,599 మంది భక్తులు దర్శించుకున్నారు. 16,069 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.21 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.