కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ లో కలకలం. కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ కాలం చెల్లిన ఆహార పదార్థాలు తెరపైకి వచ్చాయి. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. కాకినాడ సుబ్బయ్య గారి హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు జరిగాయి. సుబ్బయ్య గ్రూప్స్‌కు చెందిన మూడు హోటళ్లపై దాడులు జరిగాయి.
అయితే.. ఈ తనిఖీల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు, నిల్వ పచ్చళ్లు, పొడులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. మరోసారి ఇలాగే వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హోటల్ యాజమాన్యాన్ని హెచ్చరించారు అధికారులు. ఇక కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ కాలం చెల్లిన ఆహార పదార్థాలు తెరపైకి రావడంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
కాకినాడ సుబ్బయ్య గారి హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
సుబ్బయ్య గ్రూప్స్‌కు చెందిన మూడు హోటళ్లపై దాడులు
తనిఖీల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు, నిల్వ పచ్చళ్లు, పొడులు విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు
మరోసారి ఇలాగే వ్యవహరిస్తే కఠిన చర్యలు… pic.twitter.com/y3jBKlDfC9
— Telugu Scribe (@TeluguScribe) February 6, 2025