రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం. కుక్కల ద్వారా చిన్నారికి వైరస్ సోకినట్లు చెబుతున్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన చేపూరి శ్రీమేధ (4) అనే చిన్నారికి జ్వరం, అలర్జీ రావడంతో సిరిసిల్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళారట. ఎన్ని పరీక్షలు చేసినా వ్యాధి నిర్ధారణ కాకపోవడంతో చిన్నారిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/Untitled-1-27.jpg)
అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు “బ్రూసెల్లా ఇథిపికల్” అనే వైరస్ సోకిందని, ఇది సామాన్యంగా కుక్కలకు వచ్చే వైరస్ అని తేల్చారు. ఆ వైరస్ వచ్చిన కుక్కల మధ్య ఆడుకోవడంతో చిన్నారికి కూడా సోకి ఉంటుందని వైద్యులు వివరించారు. అయితే.. దీనిపై వైద్యులు ఆరా తీస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
కుక్కల ద్వారా చిన్నారికి సోకిన వైరస్
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన చేపూరి శ్రీమేధ (4) అనే చిన్నారికి జ్వరం, అలర్జీ రావడంతో సిరిసిల్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు
ఎన్ని పరీక్షలు చేసినా వ్యాధి నిర్ధారణ కాకపోవడంతో చిన్నారిని హైదరాబాద్లోని ఓ… pic.twitter.com/sCxhBzLVps
— Telugu Scribe (@TeluguScribe) February 7, 2025