భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు డెలివరీ చేయకుండా వైద్యులు ఇబ్బందులు పెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ ఆసుపత్రిలో డెలివరీ చేసుకుంటే నొప్పి రాదా.. గవర్నమెంట్ ఆసుపత్రిలోనే నొప్పి వస్తుందా?.. సినిమాలు ఎక్కువగా చూస్తావా.. డైలాగులు చెప్తున్నావంటూ గర్భిణీ స్త్రీని వైద్యులు ఇబ్బంది పెట్టినల్లు తెలిసింది.
అంతేకాకుండా, డెలివరీ చేయడానికి అక్కడి సిబ్బంది డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం.ఆసుపత్రిలో పురిటి నొప్పులు భరించలేకపోతున్నానని వేడుకున్నా వైద్యులు కనికరం చూపని లేదని, నొప్పి గవర్నమెంట్ ఆసుపత్రిలోనే వస్తుందా? ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకో అని గర్భిణులను డాక్టర్లు తిడుతున్నారని బాలింతలు చెబుతున్నారు.
బిడ్డ బయటకు వచ్చే సమయంలో నొప్పిని భరించలేక వేడుకున్న గర్భిణీని మొదటి కాన్పు ప్రైవేట్ ఆసుపత్రిలో చేయించుకున్నావా? అక్కడ నొప్పులు రాలేదా? సినిమాలు ఎక్కువ చూస్తావా, డైలాగులు చెప్తున్నావు అంటూ వైద్యురాలు ప్రమీలారాణి వెటకారం చేసినట్ల బాధిత బాలింత చెప్పింది. కాన్పు అయ్యాక బిడ్డను పక్కన పడేసారని, ఆ తర్వాత ఎవరూ మమ్మల్ని పట్టించుకోలేదని తెలిపింది.రిజిస్టర్లో మా పేర్లు కూడా తప్పుగా రాశారని, పేర్లు సరిచేయమంటే లంచం అడుగుతున్నారని, రోగులకు నీళ్ల పాలు ఇస్తున్నారని బాలింత ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రైవేట్ ఆసుపత్రిలో డెలివరీ చేసుకుంటే నొప్పి రాదా.. గవర్నమెంట్ ఆసుపత్రిలోనే నొప్పి వస్తుందా?
సినిమాలు ఎక్కువగా చూస్తావా.. డైలాగులు చెప్తున్నావంటూ గర్భిణీ స్త్రీని టార్చర్ పెట్టిన వైద్యులు
భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు డెలివరీ చేయకుండా ఇబ్బందులు పెడుతున్న… pic.twitter.com/45wK0W8MEM
— Telugu Scribe (@TeluguScribe) February 7, 2025