చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి విడదల రజినిపై SC,ST అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. కేవలం మాజీ మంత్రి పైనే కాకుండా.. 2019 లో సిఐగా ఉన్న సూర్యనారాయణతో పాటు, రజిని పిఏ అయినా నాగ ఫణీంద్ర.. మరో పిఏ రామకృష్ణ దొడ్డ పై ఈ కేసు నమోదు చేసారు చిలకలూరిపేట అర్బన్ పోలీసులు. సిబిఎన్ ఆర్మీ ప్రెసిడెంట్ పిల్లి కోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసారు చిలకలూరిపేట అర్బన్ పోలీసులు.
అయితే తనను స్టేషన్ లో కొడుతూ, వీడియో కాల్ ద్వారా అప్పటి MLA అయిన విడదల రజనికి ఆమె పిఏ లకు చూపించారని ఆరోపణల తో ఈ కేసు నమోదు చేసారు. అయితే ఈ కేసు పైన ఇప్పటివరకు మాజీ మంత్రి విడదల రజిని గాని లేక ఆమె తరపు లాయర్లు కానీ ఎవరు స్పందించలేదు. చూడాలి మరి ఈ కేసు అనేది ఎటు వెళ్తుంది అనేది.