మార్కెట్ శక్తుల చేతిలోనే రూపాయి విలువ : RBI గవర్నర్

-

దేశీయ కరెన్సీ రూపాయి విలువ క్షీణించడం పై RBI గవర్నర్ సంజయ్ మల్హొత్రా తాజాగా స్పందించారు. డాలర్ తో  రూపాయి విలువను మార్కెట్ శక్తులు నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. రూపాయి విలువ రోజువారి మార్పులపై ఆర్బీఐ పెద్దగా ఆందోళన చెందబోదని తెలిపారు. దీర్షకాల, మధ్యస్థ కాలంలో రూపాయి విలువ మార్పు పైనే ఆర్బీఐ దృష్టి సారిస్తుందని చెప్పారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.87.50గా ఉంది. ఆర్బీఐ తాజాగా 25 బేసిస్ పాయింట్ల మేరకు రెపోరేటును సవరించిన నేపథ్యంలో 9 పైసలు మేరకు బలపడింది. 

ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధుల నుంచి రూపాయి పతనం పై ప్రశ్న ఎదరవ్వగా.. ఆర్బీఐ గవర్నర్ స్పందించారు. రూపాయి విషయంలో ఆర్బీఐ గవర్నర్ స్పందించారు. రూపాయి విషయంలో ఆర్బీఐ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. రూపాయి విలువ స్తాయిని గానీ, ఒక బ్యాండ్ ను గానీ మేము చూడబోమన్నారు. ఎప్పుడైనా భారీ స్థాయిలో ఒడుదొడుకులు ఎదుర్కొంటే జోక్యం చేసుకుంటామని తెలిపారు. రోజువారి విలువ తగ్గడం, పెరగడం గురించి పట్టించుకోమని తెలిపారు ఆర్బీఐ గవర్నర్.

Read more RELATED
Recommended to you

Latest news