గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ కొడంగల్ నియోజకవర్గం లో పర్యటించేందుకు రంగం సిద్ధం చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో రైతుల మహా ధర్నాకు పిలుపునిచ్చింది గులాబీ పార్టీ. ఈ నేపథ్యంలోనే ఇవాళ కొడంగల్ వెళ్లనున్నారు కేటీఆర్. ఎన్నికల సమయంలో ప్రచారానికి వెళ్లిన తర్వాత ఇదే మొదటిసారి కేటీఆర్ వెళ్లడం. ఈ రోజు మధ్యాహ్నం కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో… గులాబీ పార్టీ ఆధ్వర్యంలో రైతు మహాధర్న జరగనుంది.
ఈ మహా ధర్నాకు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కొడంగల్ కేటీఆర్ వెళుతున్న నేపథ్యంలో…. దారిలోనే అతన్ని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ అన్న సంగతి తెలిసిందే. అలాంటి కొడంగల్ నియోజకవర్గం లో గులాబీ పార్టీ ధర్నాలు, దీక్షలు చేస్తే… ఊరుకునేది లేదని ఇటు కాంగ్రెస్ నేతలు కూడా హెచ్చరి స్తున్నారు.