నేషనల్ హైవేస్ వెంట జీడీ తోటలు పెంచాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHRI) చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్‌కు రిక్వెస్ట్ చేశారు. మంగళవారం ఢిల్లీలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్‌తో పాటు ఎన్హెచ్ఏఐ చైర్మన్‌ను కలిశారు.ఈ సందర్భంగా నేషనల్ హైవేైస్ వెంట జీడి పండ్ల తోటల పెంపకం చేపట్టాలని వినతి పత్రం సమర్పించారు.
జీడీ తోటల పెంపకం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని, అంతేకాకుండా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. టోల్ ప్లాజాల యాజమాన్యాలు మారినా అందులో పనిచేస్తున్న సిబ్బందిని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్త సిబ్బంది రాకతో పాత సిబ్బంది ఉపాధి కోల్పోతున్నారని, అందుకే పాత సిబ్బంది జీవనోపాధి కోల్పోకుండా వారినే కంటిన్యూ చేయాలని కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఎంపీ రఘునందన్ ట్వీట్ చేశారు.