తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడానికి ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని ఓట్లేసిన జనం ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆ పార్టీ నేతలను నిలదీస్తూనే ఉన్నారు. దీంతో ఓపికగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన నేతలు సహనం కోల్పోయి దూషిస్తున్నారు.
తాజాగా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఓ మహిళను దూషించి వివాదంలో చిక్కుకున్నారు. మంగళవారం ఉదయం వనపర్తి జిల్లా అమరచింతలో కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటుతో తులం బంగారు ఇవ్వాలని అడిగిన మహిళను.. ‘నీ అమ్మ ఇత్త పో’ అంటూ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సమాధానం ఇచ్చారు. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నీ అమ్మ ఇత్త పో..
వనపర్తి జిల్లా అమరచింతలో కళ్యాణ లక్ష్మి చెక్కుతోపాటుతో తులం బంగారు ఇవ్వాలని అడిగిన మహిళకు.. నీ అమ్మ ఇత్త పో అంటూ సమాధానం ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి pic.twitter.com/8vMIwSUNsK
— Telugu Scribe (@TeluguScribe) February 11, 2025