ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో ఆధ్మాత్మిక పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ముందుగా కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం కేరళలోని ప్రముఖ ఆలయాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకుంటారని తెలుస్తోంది.
ఆ తర్వాత మిగతా తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఆయన పర్యటన కొనసాగనుంది. నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుందని తెలుస్తోంది. అందుకోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాగా, పవన్ కళ్యాణ్ గత కొద్దిరోజులుగా స్పండిలైటీస్, జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. అయినప్పటికీ ఆయన ఆధ్యాత్మిక పర్యటనలు చేయాలని నిర్ణయించుకోవడం విశేషం.