వల్లభనేని వంశీ అరెస్ట్ పై X వేదికగా స్పందించింది వైసీపీ పార్టీ. వంశీపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని… గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వంశీకి ముందస్తు బెయిల్ ఉందని గుర్తు చేసింది వైసీపీ. ఇటీవల సత్యవర్థన్ కూడా ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారని. చంద్రబాబు.. ఇంకెన్నాళ్లు ఈ కక్షపూరిత రాజకీయాలు అంటూ ఆగ్రహించింది వైసీపీ పార్టీ.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/Untitled-1-43.jpg)
కాగా…. వల్లభనేని వంశీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు అయింది. సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు వల్లభనేని వంశీ పై కేసు పెట్టారు.. మొత్తం 7 సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు విజయవాడ పటమట పోలీసులు.. 140, 308, 351 రెడ్ విత్ 3 (5) సెక్షన్ల కింద వంశీపై కేసు అయింది. ఈ తరుణంలోనే… ఇవాళ ఉదయం హైదరాబాద్ లో ఉన్న వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.