రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకోవడం ఆగడం లేదు.తాజాగా మరోసారి ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిని ఇద్దరు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లిలోని మహాత్మ జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాలలో గురువారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది.
నిన్న సాయంత్రం భోజనం చేసిన తరువాత ఇద్దరు 7వ తరగతి విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం.కడుపు నొప్పి,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో గుర్తించిన పాఠశాల సిబ్బంది విద్యార్ధినులను వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసి పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలో ఆగని ఫుడ్ పాయిజన్ ఘటనలు.
నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి లోని మహాత్మ జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్
సాయంత్రం భోజనం తిన్న తరువాత ఇద్దరు 7వ తరగతి విద్యార్థినులకు అస్వస్థత
కడుపు నొప్పి,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో విద్యార్ధినులను ప్రైవేట్… pic.twitter.com/LfPh15ShF9
— Telugu Scribe (@TeluguScribe) February 13, 2025