కేటీఆర్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు అద్దంకి దయాకర్. ఇవాళ గాంధీ భవన్ లో అద్దంకి దయాకర్ మాట్లాడుతూ… పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫాం హౌజ్ లో జరుగుతున్న అరచకరాలకు కారణం కేటీఆర్ అన్నారు. పోచంపల్లి ఎవరికి గుర్తే లేడు, ఆయన కేటీఆర్ తో చేసిన దందాలతో మళ్ళీ తెరపైకి వచ్చాడని ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఫాం హౌజ్ లో ఉంటే కేటీఆర్ డ్రగ్స్ బిజినెస్ లో బీజీగా ఉన్నాడని ఆరోపణలు చేశారు. కేటీఆర్ తెలంగాణను క్యాసినో హబ్ గా మార్చారని… జై తెలంగాణ అనే హక్కు కేటీఆర్ కి లేదు? అంటూ రెచ్చిపోయారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/01/addanki-dayakar.jpg)
తెలంగాణ ప్రజల రక్తం తాగిన రాక్షసులు బీఆర్ఎస్ నేతలు..రేవంత్ బలం ఏంటో కేటీఆర్ వాళ్ళ అయ్యని అడిగితే తెలుస్తుందని చురకలు అంటించారు. తెలంగాణను దోచుకున్న దొంగలు కేసీఆర్ ఫ్యామిలీ.. మీ ఎమ్మెల్యేలు పది మంది మిమ్మల్ని ఎందుకు వదిలారో ఆలోచించారా? అంటూ నిలదీశారు. దొంగలకు నాయకుడు కేటీఆర్.. దొంగలు నీతులు చెప్పడం ఏంది?? అంటూ ప్రశ్నించారు. సారా అమ్మి జైలుకి వెళ్లి బయటకి వచ్చి జై తెలంగాణ అంటారా? కేటీఆర్ ఏసీబీ దొంగ.. కేటీఆర్ భూముల దందా మాకు తెలుసు అని ఫైర్ అయ్యారు అద్దంకి దయాకర్.