వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు.. విజయవాడకు తరలించారు. వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో కీలక
ప్రకటన చేశారు కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు.. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ తో పాటు పోలీస్ యాక్ట్ – 30 అమలులో ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ సెక్షన్ అమలు నేపథ్యంలో నిరసనలు, ర్యాలీలపై పూర్తిగా నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు. అయితే పోలీసులు నిషేదాజ్ఞలను అతిక్రమించి వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు.
హైదరాబాద్ లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ చేసి విజయవాడ తీసుకెళ్లిన పోలీసులు.. ముందుగా భవానీపురం పీఎస్ కి వల్లభనేని వంశీని తలించారు. అక్కడ వాహనాన్ని మార్చి మరో చోటుకు తరలించే ప్రయత్నం చేశారు పటమట పోలీసులు. మార్గమధ్యలో పోలీసులతో వంశీ వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం వల్లభనేని వంశీని ప్రశ్నిస్తున్నారు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు పోలీసులు. ఆయన పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు అయింది.