కొందరు ప్రభుత్వ ఉద్యోగులు తమకు వస్తున్న వేతనాలతో పాటే బయట అక్రమార్జనకు బాగా అలవాటు పడినట్లు తెలుస్తోంది. ప్రతి చిన్న పనికి డబ్బులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ రైతును లంచం డిమాండ్ చేసి ఓ సర్వేయర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు.
ఈ ఘటన నల్లగొండ జిల్లాలోని మర్రిగూడ మండలంలో శనివారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. తన భూమిలోని హద్దులను డిసైడ్ చేసేందుకు రైతు తహశీల్దార్ ఆఫీసులోకి సర్వేయర్ రవిని కలిశాడు. అందుకు అతను రైతు దగ్గర నుంచి రూ.12 వేలు డిమాండ్ చేసినట్లు తెలిసింది. తన వద్ద డబ్బులు లేవని చెప్పిన సదరు అధికారి వినిపించుకోలేదు.చివరకు బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించగా … అధికారుల సలహా మేరకు సర్వేయర్‌కు రూ.12వేల లంచం ఇవ్వగా ఏసీబీ సర్వేయర్ రవినాయక్ ను అదుపులోకి తీసుకుంది.