ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేతో అన్ని వర్గాల వారికి సరైన న్యాయం జరుగుతుందని నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం ఆలయం పెద్దగట్టు జాతర వద్దకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో నిర్వహించిన కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. 1931లో బ్రిటీష్ వారు నిర్వహించిన జనగణన తర్వాత అదేవిధంగా అందరికీ న్యాయం జరిగేలా కులగణన తమ హయాంలో నిర్వహించామన్నారు. ఇక ఏపీకి నీటిని తరలిస్తున్నారన్న హరీశ్ రావు వ్యాఖ్యలు అర్ధరహితం అని వెల్లడించారు. అలాంటి అర్థం పర్థం లేని మాటలకు స్పందించాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.