విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమ్మె సైరన్ మోగింది. జీతాలు పెంచాలని కాంట్రాక్ట్ లేబర్ యూనియన్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే జీతాలు సరిపోవడం లేదని, వెంటనే పెంచకపోతే బతలేని పరిస్థితి ఉందని ప్లాంట్ యాజమాన్యానికి పలుమార్లు యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. పలు దఫాలు చర్చలు జరిపారు. కానీ జీతాల పెంపుపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో సమ్మెకు
దిగుతున్నట్లు ప్లాంట్ యజమాన్యానికి కార్మికులు తాజాగా నోటీసులు అందజేశారు. 14 రోజుల్లో సమస్యను పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో రన్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ప్లాంట్ ను ఆదుకునేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. నష్టాల నుంచి బయటపడేందుకు రూ.14 వేల కోట్లు సాయం ప్రకటించింది. దీంతో ప్లాంట్ యాజమాన్యానికి ఉపశమనం కలిగింది. ఈ మేరకు ప్లాంట్ లో నిర్విరామంగా స్టీల్ ఉత్పత్తి జరుగుతోంది. అయితే సడెన్గా కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ల షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. సమ్మె చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. దీంతో కార్మికులు తీసుకున్న ఈ సమ్మె నిర్ణయం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. మరి కార్మికులతో స్థానిక నాయకులు చర్చించి సమ్మె విరమణకు కృషి చేస్తారేమో చూడాలి.