SLBC టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఈ ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.

కాగా, శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ పనులు జరుగుతున్న వేళ ఘోర ప్రమాదం సంభవించింది.టన్నెల్ 14వ కి.మీ మైలురాయి వద్ద సుమారు 3 కి.మీ మేర పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. మరికొందరు కార్మికులు టెన్నెల్‌లోనే చిక్కుకున్నట్లు సమాచారం. నాగర్ కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ ఘటనా స్థలికి చేరుకుని ఇరిగేషన్ అధికారులను వివరాలు అడిగి సేకరించారు. సహాయక చర్యలను వేగవంతం చేశారు.