ఒడిస్సా నుండి ఏపీకి పెద్ద ఎత్తున గంజాయి తరలింపు..!

-

జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లో 3,737 కిలోల గంజాయిని ధ్వంసం చేసారు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. ఇతర పోలీసు ఉన్నతాధికారులు. ఈ సందర్భంగా డీజీపి హరీష్ కుమార్ మాట్లాడుతూ.. గంజాయి సమస్య పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కొన్ని ప్రత్యేక టీమ్ లను కూడా ఏర్పాటు చేసింది. ఈగిల్ టీమ్ లు గంజాయి కి వ్యతిరేకం గా పనిచేస్తున్నాయి. ఒడిస్సా ప్రాంతం నుండి పెద్ద ఎత్తున గంజాయి వస్తుంది.

దానిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. గంజాయి గ్యాంగ్ లు , అమ్మే వాళ్ళ ఆస్తులు సీజ్ చేస్తాం. గంజాయి, డ్రగ్స్ సరఫరా చేసే వాళ్ళ పై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం… కఠిన శిక్షలు ఉంటాయి. కొన్ని కళాశాలల్లో విద్యార్దులు డ్రగ్ వాడకం చేస్తున్నారు.. ఇది సమాజంలో బాధాకరం. ఈగల్ టీమ్ ల ద్వారా కళాశాలల్లో కౌన్సిలింగ్ అవగాహన సదస్సులు పెడుతున్నాం. భవిష్యత్ లో మరిన్ని కళాశాలల్లో కౌన్సెలింగ్ క్లాసులు నిర్వహిస్తాం అని డీజీపీ హరీష్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news