మందేసి నడిరోడ్డుపై చిందేసిన యువతి.. ఆపై హోంగార్డుపై దాడి

-

మద్యం మత్తులో యువతి హల్చల్ చేసింది. మందేసిన మైకంలో నడిరోడ్డుపై చిందేయడమే కాకుండా, తాగి ఊగి నడి రోడ్డుపై తైతక్కలాడింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని మధురానగర్‌లో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. సదరు యువతిని మూవీ ఆర్టిస్ట్ మేకల సరితగా గుర్తించారు.

మద్యం తలకెక్కిన మైకంలో చరణ్ అనే వ్యక్తిని దుర్భాషలాడి..అటుగా వెళ్ళేవారిని వదలకుండా వారిపై తన అహంకారం ప్రదర్శించింది. ఆమెను అడ్డుకునేందుకు యత్నించిన మహిళా హోంగార్డ్ పై సైతం దాడికి పాల్పడినట్లు తెలిసింది.ఆమెతో విసిగి పోయి భర్త రాజేష్‌కు ఫోన్ చేసి పిలిపించి పోలీసులు అప్పగించారు.దీంతో సరిత మీద న్యూసెన్స్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మధురానగర్ పోలీసులు తెలిపారు.

https://twitter.com/TeluguScribe/status/1894258859851542534

Read more RELATED
Recommended to you

Latest news