vallabhaneni vamshi: వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. వల్లభనేని వంశీ పై భూ కబ్జా కేసు నమోదు చేశారు. గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ లో రూ.10 కోట్ల విలువైన స్థలం కబ్జా చేశారని కేసు నమోదు చేశారు పోలీసులు. హైకోర్టు న్యాయవాది సతీమణి సుంకర సీతామహాలక్ష్మి పేరిట ఉన్న స్థలం కబ్జా చేసినట్టు ఫిర్యాదు చేశారు.

వల్లభనేని వంశీతో పాటు మరో 15 మందిపై ఫిర్యాదు చేశారు హైకోర్టు న్యాయవాది సతీమణి సీతా మహాలక్ష్మి. దీంతో… వల్లభనేని వంశీ పై భూ కబ్జా కేసు నమోదు చేశారు. ఇక అటు వల్లభనేని వంశీని కస్టడీలోకి తీసుకున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసులు. దీంతో నేటి నుంచి మూడు రోజుల పాటు విచారణను ఎదుర్కొంటారు వల్లభనేని వంశీ. ఇక వల్లభనేని వంశీని విచారించేందుకు ప్రశ్నలను సిద్దం చేసుకున్నారు పోలీసులు. సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఆధారంగా వంశీ విచారణ ఉంటుంది.