కాంగ్రెస్ హైకమండ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు బలపరిచిన నరేందర్ రెడ్డి గెలుపు కోసం సమష్టిగా కృషి చేయాలి అని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. యువతను ఆదుకునేందుకు నరేంద్ర మోడీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ నిరుద్యోగులకు ఇచ్చిన మాట మరిచింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 56 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినం. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నియామక ఉత్తర్వులు అందజేశారు.
గతంలో బీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు వేతనం ఇవ్వడంలో జాప్యం చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటో తారీఖు నాడు వేతనాలు ఇస్తున్నాం. పట్టభద్రులు రాజకీయాలకు అతీతంగా జీవన్ రెడ్డి నీ గెలిపించారు అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టి, పట్టభద్రుల పక్షాన నిలిచారు. జీవన్ రెడ్డి స్థానంలో నరేందర్ రెడ్డి కి పట్టభద్రుల ఎమ్మెల్సీ గా అవకాశం కల్పించిన నేపథ్యంలో కరీంనగర్ ముద్దు బిడ్డ నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలనీ పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు లక్ష్మణ్ కుమార్.