SLBC టన్నెల్ లోపల మళ్ళీ కూలే చాన్స్ ఉందని రెస్క్యూ సిబ్బంది ఒకరు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. తాము వెళ్లినప్పుడు 22,23 బ్లాక్స్ లూస్‌గా ఉన్నాయని, అక్కడ ఏ క్షణమైనా మట్టి కూలే ప్రమాదం ఉందని మేము తిరిగి వచ్చేశామని వెల్లడించారు.
తమ బృందం 11 మంది వెళ్లాం. తమ వెనకాల ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చింది. మేము వెళ్లగలిగే చివరి ఏరియా వరకు వెళ్లాం..కానీ, తమకు ఎవరూ కనిపించలేదు. మట్టి మళ్ళీ కూలేలా ఉందని తిరిగి వచ్చేశాం. మేము డెహ్రాడూన్ – ఉత్తర కాశీ ప్రమాదంలో 41 మందిని కాపాడామని, కానీ ఇక్కడ ప్రమాదంలో ఏం చెప్పలేకపోతున్నామని రెస్క్యూ సిబ్బంది స్పష్టంచేశారు.