ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న వేళ వైఎస్సార్ సీపీ పార్టీ ఎమ్మెల్యేల మీద సీఎం చంద్రబాబు నాయుడు శాసనసభలో స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని వైసీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. గత రెండ్రోజులుగా ఇదే పర్వం కొనసాగుతోంది. అంతేకాకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రామని మాజీ సీఎం జగన్ నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు మాట్లాడుతూ.. తన 40ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రామని చెప్పిన వారిని నిన్న చూశామని.. అది నిజంగా చీకటి రోజన్నారు.‘గత ఎన్నికల్లో ప్రజలు 11 మందిని గెలిపించారు. నేడు వారు 11 గంటలకు వచ్చారు. 11 గంటల 11 నిమిషాలకు వెళ్లిపోయారు. ఈ 11 నిమిషాల్లోనే స్పీకర్ను అవమానించారు.ప్రతిపక్షహోదా ఇస్తేనే సభ జరగనిస్తామనడం కరెక్ట్ కాదు’ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు.
ప్రజలు 11 మందిని గెలిపించారు
11 గంటలకు వచ్చారు
11 గంటల 11 నిమిషాలకు వెళ్లిపోయారుఈ 11 నిమిషాల్లోనే స్పీకర్ను అవమానించారు.
ప్రతిపక్షహోదా ఇస్తేనే సభ జరగనిస్తామనడం అనేది చీకటి రోజు
– ఏపీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు#AndhraPradesh #Telangana #Congress #Hyderabad… pic.twitter.com/8W8kiG74NF
— Telugu Galaxy (@Telugu_Galaxy) February 26, 2025