పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ రద్దు..!

-

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. దీంతో ఈ టోర్నీలో వర్షం వల్ల ఆగిపోయిన రెండో మ్యాచ్ గా ఇది నిలిచింది. అయితే ఈ టోర్నీ గ్రూప్ ఏ లో ఉన్న ఈ రెండు జట్లు కూడా ఇప్పటికే సెమీస్ రేస్ నుండి ఎలిమినేట్ అయ్యాయి. అలాగే ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవాలి ఈ రెండు జట్లు విజయంతో టోర్నీని ముగించాలి అనుకున్నాయి.

ముఖ్యంగా 27 ఏళ్ళ తర్వాత తమ దేశంలో ఐసీసీ టోర్నీ నిర్వహిస్తున్న పాకిస్థాన్.. సెమీస్ కు చేరకుండా అభిమానులను నిరాశపరిచింది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ గెలిచి తమ అభిమానులను సంతోషపరచాలి అనుకుంటే.. వరుణుడు అడ్డుపడ్డాడు. అయితే రావల్పిండి వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. అక్కడ ఈరోజు మొత్తం వర్షం పడేందుకు 84 శాతం ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పుడు అందుకు తగినట్లుగానే కనీసం టాస్ కూడా పడకుండా ఈ మ్యాచ్ అనేది క్యాన్సిల్ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news