రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రెడిబిలిటీ కోల్పోయిందని మాజీ మంత్రీ చెల్లు బోయిన వేణు గోపాల కృష్ణ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అనేక వాగ్దానాలు ఇచ్చారు. తొమ్మిది నెలల పాలనలో ప్రజలకు ప్రభుత్వం చేసిన మోసం అర్థమైపోయిందన్నారు. ఈ ప్రభుత్వం కక్ష సాధింపులకు మాత్రమే పూర్తి సమయం వెచ్చిస్తుంది. ప్రజలు ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. కేవలం కక్ష సాదింపు కోసమేనా అని ఆయన ప్రశ్నించారు.
ఎన్నికలకు ముందు ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పిన తరువాత ఏడు లక్షల కోట్లకు మాట మార్చారు. చంద్రబాబు అబద్ధాల కోరు అని మళ్లీ నిరూపితమైంది. తిరుమల లడ్డూను పరీక్షించకుండా కల్తీ జరిగిందని ప్రభుత్వం ఎలా చెప్పింది. అధికారం అనే అతిపెద్ద బాధ్యతను విస్మరించి ప్రభుత్వం పాలన చేస్తుందని చెల్లుబోయిన వేను పేర్కొన్నారు.