రాష్ట్ర జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువు పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో మూడు నెలల పాటు పొడిగించింది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డుల కాల పరిమితి శుక్రవారం తో ముగియనుంది. దీంతో మే నెల 31 వరకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జర్నలిస్టుల అక్రిడిటేషన్ పై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోబోతుందని.. అలాగే ఇళ్ల స్థలాలపై చర్చిస్తామని గతంలోనే రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. గత ప్రభుతవం అక్రిడిటేషన్ కార్డుల విషయంలోనూ నిర్లక్ష్యం చేసిందని.. కూటమి ప్రభుత్వం అయినా అర్హులైన వారందరికీ అవకాశం ఇస్తుందని జర్నలిస్టులు ఆశీంచారు. కానీ పాత కార్డుల గడువునే పెంచడంతో కొత్త కార్డుల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టుల్లో ప్రభుత్వ ప్రకటన నిరాశనిపించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల తరువాత అయినా అర్హులందరికీ కార్డులు జారీ చేయాలని కోరుతున్నారు.