SLBC టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది మృతి చెందారు. మరణించారు ఆరుగురు కార్మికులు, ఇద్దరూ ఇంజినీర్లు. అధునాతన పరికరాలు, రాడార్ లతో 3 మీటర్ల లోతు మట్టిలో మృతదేహాలున్నాయి. గత కొద్ది రోజుల నుంచి వారి ఆచూకి కోసం గాలించిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఇవాళ వారి సమాచారం తెలిసింది. 8 మంది సజీవ సమాది అయ్యారు.
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంలో 8 మంది కోసం దాదాపు 6 రోజుల నుంచి శ్రమించారు. ఈ క్రమంలోనే అందులో చిక్కుకున్న 8 మందిని బయటకు తీసుకు వచ్చేందుకు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, హైడ్రా, సింగరేణి రెస్క్యూ టీమ్ సైతం శ్రమించాయి. బురద, నీరు సహాయక చర్యలకు అడ్డుతగిలినప్పటికీ వీరిని ఎలాగైనా బయటకు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం కూడా ముందుకు వెల్లింది.