ఏపీలో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలోనే అధికారులు వాహనాలను తరవుగా చెక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద వాహనాలను తనిఖీలు చేస్తున్న సీఐతో ఓ సామాన్యుడు వాగ్వాదానికి దిగాడు.
తన వాహనాన్ని ఆపి డాక్యుమెంట్స్ చూపించాలని సదరు సీఐ కోరగా.. ముందు మీ పోలీసు ఐడీ చూపిస్తేనే తాను తన లైసెన్సు చూపిస్తానని వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది.ఈ మధ్య దొంగ పోలీసులు ఎక్కువ అయ్యారని సామాన్యుడు తన అనుమానం వ్యక్తం చేయగా..చివరకు చేసేదేమీ లేక సీఐ తన ఐడీ కార్డుని చూపించడంతో ఆ వ్యక్తి కూడా డాక్యుమెంట్స్ చూపించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.