పోసాని కృష్ణ మురళి హెల్త్ బులిటెన్ రిలీజ్ అయింది. అన్నమయ్య జిల్లాకు మళ్లీ సినీ నటుడు పోసాని కృష్ణ మురళిను తరలించారు. ఈ సందర్భంగా పోసాని కృష్ణ మురళి హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు అధికారులు. పోసాని కృష్ణ మురళి ఆరోగ్యం నిలకడగా ఉందని క్లారిటీ ఇచ్చారు పోలీసులు. ఉదయం అల్పాహారంగా గోదుమ ఉప్మా తిన్నారట పోసాని కృష్ణ మురళి.

రాజంపేట సబ్ జైల్లో మూడు రోజులు గా రిమాండ్ ఖైదీగా ఉన్నారు పోసాని కృష్ణ మురళి. నిన్న రాజంపేట, కడప ఆసుపత్రులల్లో పోసాని కృష్ణ మురళికి వైద్య పరీక్షలు చేశారు. అయితే… ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తేలిందట. దీంతో తిరిగి రాత్రి సబ్ జైలు కు తరలించిన తర్వాత ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాలేదని ప్రకటించారు జైలు అధికారులు.