నెల్లూరు జిల్లాలో అఘోరి హల్చల్..రంగంలోకి హిజ్రాలు!

-

నెల్లూరు జిల్లాలో అఘోరి హల్చల్ చేసింది. దీంతో రంగంలోకి హిజ్రాలు దిగి.. అక్కడి మ్యాటర్‌ సెటిల్‌ చేశారు. చిల్లకూరు మండలం భూధనం టోల్ ప్లాజా వద్ద ఆవుల లోడుతో వెళ్తున్న 3 లారీలను అడ్డగించింది అఘోరీ. సరైన పత్రాలు చూపించి వాహనాలు తీసుకెళ్లాలని అటకాయింపునకు దిగింది అఘోరి.

Aghori intercepted 3 lorries loaded with cows at Bhudhanam toll plaza of Chillakuru mandal

చెన్నై నుంచి విజయవాడ వెళ్తూ మార్గమధ్యలో లారీల నిలుపుదల చేశారు. అఘోరి చేష్టలతో కాసేపు తల పట్టుకు కూర్చున్నారు చిల్లకూరు పోలీసులు. అఘోరీరని అక్కడి నుంచి పంపేందుకు స్థానిక హిజ్రాల సాయం కోరారు పోలీసులు. ఈ తరుణంలోనే… టోల్ ప్లాజా వద్దకు చేరుకొని అఘోరిని అక్కడి నుంచి పంపేశారు పోలీసులు, హిజ్రాలు. దీంతో అక్కడి సంఘటన సద్దుమణిగింది.ఈ సంఘటన వీడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news