ఏపీలో మాంసహారులకు అలర్ట్. ఏపీలో చికెన్ ధరలు పెరిగాయి. ఏపీలోని విజయవాడ, విశాఖ, తిరుపతి లాంటి పట్టణాలలో చికెన్ మార్కెట్లను బర్డ్ ఫ్లూ భయం వీడింది. శివరాత్రి తర్వాత నుంచి క్రమంగా చికెన్ సేల్ పెరుగుతోంది. దీంతో… ఏపీలో చికెన్ ధరలు పెరిగాయి. కేజీ 200 రూపాయలకు చేరింది చికెన్ ధర. దాదాపు 50 రూపాయలు పెరిగింది చికెన్ కిలో రేటు.

గడిచిన 15 రోజుల పాటు తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నారు చికెన్ వ్యాపారులు. ఎండలు పెరడగడంతో బర్డ్ ఫ్లూ తగ్గు ముఖం పట్టింది. చికెన్, ఎగ్ కొనుగోళ్ళు సాధారణ స్థితికి వచ్చాయి. అటు చికెన్ ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు.