ఏపీలో 24 గంటలు జోరుగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. అన్నమయ్య జిల్లాలోని అనంతపురం గంగమ్మ జాతరలో ఏరులై పారింది మద్యం. ఈ సందర్భంగా తాగి ఊగారు మందుబాబులు. అన్నమయ్య జిల్లాలోని అనంతపురం గంగమ్మ జాతరలో మద్యం షాపులు వెలిశాయి. దీంతో… అన్నమయ్య జిల్లాలోని అనంతపురం గంగమ్మ జాతరలో చేసుకున్నారు మద్యం ప్రియులు.

అధికారుల సాక్షిగా బారులను తలపించారు వైన్ షాపులు. రాత్రి పగలు తేడా లేకుండా 24 గంటలు జోరుగా మద్యం అమ్మకాలు జరిగాయి. అయినా కూడా సంబంధిత అధికారులు…పట్టించుకోలేదు. బెల్ట్ షాపులు పెడితే తాటతీస్తామంటూ పదేపదే హెచ్చరిస్తోంది ప్రభుత్వం. కానీ గంగమ్మ జాతరలో ఏకంగా వైన్ షాపులే నెలకొల్పారు మద్యం విక్రయదారులు. ఇక అన్నమయ్య జిల్లాలోని అనంతపురం గంగమ్మ జాతరలో మద్యం ఏరులై పారిన ఇష్యూపై వైసీపీ సీరియస్ అయింది.