తెలంగాణలోని మహబూబాద్ జిల్లాలో కిడ్నీ దందా వెలుగులోకి చూసింది. జిల్లాలోని రాజోలులో చిట్టిబాబు అనే వ్యక్తిని ఒప్పించి గుర్తుతెలియని ముఠా కిడ్నీ కాజేసింది. అనంతరం దానిని అమ్ముకున్నట్లు సమాచారం.
అయితే, కిడ్నీని అమ్మేసిన తర్వాత సరైన చికిత్స అందించకపోవడంతో చిట్టి బాబు అనే వ్యక్తి అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. కిడ్నీ అమ్మిన విషయం తమకు తెలియదని.. కిడ్నీ అమ్మిన వ్యక్తులపై కురవి పోలీస్‌స్టేషన్‌లొ కూతురు అల్లుడు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కాగా, జిల్లాలో మరికొందరి కిడ్నీలు కూడా అమ్ముకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కిడ్నీ తీసుకొని..చికిత్స చేయకుండా చేయకుండా వదిలేసారు.
మహబూబాబాదు జిల్లా రాజోలు లో దారుణం. చిట్టిబాబు అనే వ్యక్తిని ఒప్పించి కిడ్నీ అమ్మిన కొందరు వ్యక్తులు. కిడ్నీని అమ్మేసిన తర్వాత సరైన చికిత్స అందించకపోవడంతో చిట్టి బాబు అనే వ్యక్తి అనారోగ్యానికి గురయ్యాడు. కిడ్నీ అమ్మిన విషయం… pic.twitter.com/8gN0IYbnzO
— ChotaNews App (@ChotaNewsApp) March 1, 2025