ఆ పార్టీలోనే మూడు ముక్కలాట జరుగుతుతుంది : అద్దంకి దయాకర్

-

తెలంగాణ బీజేపీ నేతల మాటలు నమ్మి అభాసుపాలు కాకు అని రామ్మోహన్ నాయుడుకి సూచించారు అద్దంకి దయాకర్. ఎన్డీఏ ఇన్నాళ్లు చేసింది గుండు సున్నా.. ఇచ్చింది గాడిద గుడ్డు. అప్పులు చేసింది మీ రహస్య మిత్రుడు కేసీఆర్ అని తెలుసుకోండి. ఇక రఘు నందన్ మాటలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. మీ పార్టీలోనే మూడు ముక్కలాట జరుగుతుతుంది.

మీడియలో కనపడటం కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ ఉనికి కాపాడు కోవడం కోసం చేస్తున్న ప్రకటనలు లాగానే కనిపిస్తున్నాయి. రాష్ట్రానికి మీ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉందో అది చెప్పండి. మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ వెళ్లకుండా కాపాడుకోండి. మీ ప్రభుత్వం ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. చంద్రబాబు, నితీష్ కుమార్ మీద ఆధారపడి ఉన్న ప్రభుత్వం మీది. తెలంగాణకి బీజేపీ ఏం చేసిందంటే గాడిదగుడ్డు అనేది అందరికీ తతెలుసుఆస్తిత్వం కోసం మీరు చేసే ప్రకటనలు ఎవరు నమ్మరు. ఓట్ల కోసమే ప్రతిసారి రాజకీయం చేస్తే ప్రజలు హర్షించరు అని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news