బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యమే తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కావాలనే పీసీసీ చీఫ్ మీద ఒత్తిడి చేయించి తనను పార్టీ నుంచి సస్పెన్షన్ చేయించారని ఆరోపించారు.
అందుకే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సస్పెన్షన్ ఆర్డర్‌ను ఫ్రేమ్ కట్టించి పెట్టినట్లు మల్లన్న మీడియాకు చూపించారు. బీసీ వాదంతో ముందుకు వెళతానని, 2028లో బీసీకి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా తన కార్యాచరణ ఉంటుందని మల్లన్న పేర్కొనడం గమనార్హం. సీఎం రేవంత్ కాంగ్రెస్ పార్టీని ఖతం పట్టించడానికే ఉన్నారని కూడా మల్లన్న ఆరోపించారు.