దగ్గుబాటి వెంకటేశ్వర రావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. అయితే… దగ్గుబాటి వెంకటేశ్వర రావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం అనంతరం… సీఎం చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఇద్దరూ కూడా ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

అప్పట్లో చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వర రావు గొడవలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు అన్ని మరిచిపోయారు. ఒక్కటైపోయారు. ఈ సందర్భంగా దగ్గుబాటి వెంకటేశ్వర రావు మాట్లాడారు. నాకు చంద్రబాబుతో వైరం ఉందని అంటుంటారు. అది నిజమే. కానీ ఇప్పుడు కాదని తెలిపారు. ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండాల్సిన అవసరం లేదని వివరించారు. కాలానికి అనుగుణంగా మారాలి. ఉన్న ఒకే జీవితాన్ని ఆస్వాదించాలని తెలిపారు దగ్గుబాటి వెంకటేశ్వర రావు.
నాకు చంద్రబాబుతో వైరం ఉందని అంటుంటారు. అది నిజమే. కానీ ఇప్పుడు కాదు.
ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండాల్సిన అవసరం లేదు.
కాలానికి అనుగుణంగా మారాలి. ఉన్న ఒకే జీవితాన్ని ఆస్వాదించాలి – దగ్గుబాటి వెంకటేశ్వర రావు pic.twitter.com/M3qF6Nouri
— greatandhra (@greatandhranews) March 6, 2025