మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర అస్వస్థత !

-

Minister Nimmala Ramanaidu is seriously ill: మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఏపీ అసెంబ్లీలో మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోగ్యంపై చర్చ జరుగుతోంది. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న మంత్రి రామానాయుడికి విశ్రాంతి అవసరం అంటూ ప్రకటించారు మంత్రి నారా లోకేశ్.

nimmala-ramanaidu

ఆయన విశ్రాంతి తీసుకోవడానికి రూలింగ్ ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ ను కోరుతున్నా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు లోకేశ్. దీంతో సభలో ఉన్న వారు నవ్వుకున్నారు. ఇక అటు 1994 నుంచి 2024 వరకు డీఎస్సీ ద్వారా 2 లక్షల 53 వేల మంది ఉపాధ్యాయులను భర్తీ చేస్తే అందులో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో లక్షా 80 వేల 22 పోస్టులు భర్తీ చేసిందన్నారు. ఇది 71 శాతం, టీడీపీ కి ఉన్న చిత్త శుద్ధి ఇది అంటూ వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ ప్రక్రియ ను నిర్ధారించడం లో ఈసారి డీఎస్సీ కాస్త ఆలస్యం అయింది కానీ మార్చి లోనే 16,473 పోస్ట్ లకు నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. విద్యా సంబంధిత అంశాలపై వైఎస్ఆర్సీపీ కి చెందిన సంఘం తో సహా అన్ని వర్గాలతో చర్చించామని తెలిపారు నారా లోకేష్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news