స్కూల్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థులపై బ్యాగ్ భారం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటన చేశారు. ఇకపై సెమిస్టర్ల వారీగా సబ్జెక్ట్ పుస్తకాలను బైండ్ చేసి ఇస్తామని అసెంబ్లీలో వెల్లడించారు నారా లోకేష్. అలాగే నాణ్యమైన యూనిఫామ్ తో కూడిన కిట్ ఇస్తామని ప్రకటించారు మంత్రి నారా లోకేశ్.

1994 నుంచి 2024 వరకు డీఎస్సీ ద్వారా 2 లక్షల 53 వేల మంది ఉపాధ్యాయులను భర్తీ చేస్తే అందులో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో లక్షా 80 వేల 22 పోస్టులు భర్తీ చేసిందన్నారు. ఇది 71 శాతం, టీడీపీ కి ఉన్న చిత్త శుద్ధి ఇది అంటూ వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ ప్రక్రియ ను నిర్ధారించడం లో ఈసారి డీఎస్సీ కాస్త ఆలస్యం అయింది కానీ మార్చి లోనే 16,473 పోస్ట్ లకు నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. విద్యా సంబంధిత అంశాలపై వైఎస్ఆర్సీపీ కి చెందిన సంఘం తో సహా అన్ని వర్గాలతో చర్చించామని తెలిపారు.