పోసాని బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ..

-

వైఎస్సార్ సీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం అదోని కోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో పోసాని కస్టడీ పిటిషన్‌పై కోర్టు తీర్పును ఇప్పటికే రిజర్వు చేసింది.దీంతో పోసానిని పోలీసులు నేరుగా కర్నూలు జైలుకు తెసుకెళ్లగా..గత ఐదు రోజులుగా అక్కడే రిమాండ్‌లో ఉంటున్నారు.

కాగా, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వారి కుటుంబం సభ్యులను సోషల్ మీడియా వేదికగా దూషించారనే ఫిర్యాదు మేరకు అదోని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు కింద పోసానిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పర్చగా, న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో కర్నూలు జైలుకు తరలించిన విషయం తెలిసిందే. కాగా, పోసానికి నేడు రిలీఫ్ లభిస్తుందా? లేదా అనేది వేచిచూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news