ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి అన్నదాత సుఖీభవ వస్తుందని ప్రకటించారు. అర్హులైన రైతులకు ఏడాది కి 20 వేలు ఇస్తామని తెలిపారు. ఇవాళ అసెంబ్లీ లో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు.

అర్హత కలిగిన ప్రతి నిరుపేద రైతుకు పరిహారం అందుతుందన్నారు అచ్చెన్నాయుడు. గత ఐదేళ్లలో వ్యవసాయ శాఖకు సంబంధించి ఒక్క కార్యక్రమం కూడా సవ్యంగా జరగలేదని ఫైర్ అయ్యారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల విషయంలో కూడా మోసం చేశారమని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్రంతో కలిసి హామీలు నెరవేరుస్తున్నామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.